హైదరాబాద్ నగరంలో రియల్ రంగాన్ని కుదేలు చేసి..ఫోర్త్ సిటీ చుట్టుపక్కల భూముల్లోకి తరలించాలనుకున్నా పాచికలు పారడం లేదు. నిన్నటికి నిన్న జనంలేని ఊహా నగరంలో మెట్రో కూతల్ని వినిపించాలని అనుకున్నా..

హైదరాబాద్ మహా నగరాభివృద్ధి రెండేండ్లుగా కుంటుపడిందనేది అక్షర సత్యం. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు శిలా ఫలకాలు దాటి అడుగు ముందుకు వేయడం లేదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉన్న నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఫోర్త్ సిటీపైనే ధ్యాస పెడుతున్నా.. ఆ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం కావడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టెండర్లు పూర్తయి… సర్వే ప్రక్రియ కూడా ముగించుకొని పనులు మొదలుపెట్టే దశకు వచ్చిన రాయదుర్గం-ఎయిర్పోర్టు మెట్రోను రేవంత్రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా, దురుద్దేశంతో రద్దు చేసింది.
