యూరియా కోసం అరిగోస పడగా.. మళ్లా యూ రి యా కష్టాలు కర్షకన్నకు దాపురించాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సరాసరి 1.95 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వే శారు.

సోమవారం గద్వాల పీఏసీసీఎస్కు 450 బస్తాల యూరియా రాగా విషయం తెలుసుకొన్న రైతులు తెల్లవారుజామున 150 మందికిపైగా రైతులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు ఐదారు గంటలు బా రులు తీరారు. పాస్బుక్కుపై ఎకరాకు రెండు, మూడు యూరియా బస్తాలను సిబ్బంది పంపిణీ చేశారు. దీంతో 100 మందికిపైగా రైతులకు యూరియా అందగా.. మిగితా వారు నిరాశతో అక్కడి నుంచి వెనుతిరిగారు. ప్రస్తుతం ఉన్న రైతులకే యూరియాను సరఫరా చేయలేని ప్రభుత్వం యాప్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పడం చూస్తుంటే రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక ఈ యాప్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.
