నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ ముసాబ్ అహ్మద్‌కు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి రావడంతో మంగళవారం మున్సిపల్ పలు విభాగాల సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.

నీలగిరి, డిసెంబర్ 30 : నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ ముసాబ్ అహ్మద్‌కు గ్రేడ్-1 కమిషనర్‌గా పదోన్నతి రావడంతో మంగళవారం మున్సిపల్ పలు విభాగాల సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నల్లగొండ పట్టణంలో పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశస్థాయిలో నల్లగొండ మున్సిపాలిటీకి అవార్డు తీసుకొచ్చారన్నారు
