
జనవరి:18 )శ్రీరామ్ చక్రి న్యూస్ ) మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెల గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ మాజీ మంత్రివర్యులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి , మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, కల్వకోల్ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అవసరమైన నిధులను సమకూర్చి అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే గతంలో ఎవరూ కోరనప్పటికీ రోడ్డు వైడెనింగ్ చేపట్టామని, ఆ రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొంటూ, ఆ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి పర్వతాలు గౌడ్, మాజీ ఎంపీటీసీ అరడి వెంకటేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ బొజ్జం చంద్రయ్య యాదవ్, సీనియర్ నాయకులు తిరుమల జగన్, కొండని లక్ష్మణ్, పెంజర్ల గోవర్ధన్, ప్రతాప్ రెడ్డి, ఇన్నారెడ్డి, పి. ఆరోగ్య రెడ్డి, పి. రాజపు రెడ్డి, కొండని నరసింహ, సాయిని కృష్ణా రెడ్డి, ఆకుల కృష్ణా, మహమ్మద్ అఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే వార్డు సభ్యులు గుర్రంపల్లి శిరీష మహేందర్ యాదవ్, బొజ్జం మల్లేష్ యాదవ్, పులిమామిడి జనార్ధన్ గౌడ్, బొజ్జం మంగ శ్రీనివాస్ యాదవ్, గూడెపు రాధా కుమార్, బొజ్జం శివకుమార్ యాదవ్, కొండని స్వాతి శేఖర్, తిరుమల యాదయ్య, యువకులు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
