మొంథా తూఫాన్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పై పంజా విసిరింది.

మొంథా తూఫాన్ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పై పంజా విసిరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 41.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో భీమదేవరపల్లి మండలంలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దాదాపు గ్రామాల్లోని అన్ని చెరువులు, కుంటలు నిండుకున్నాయి. దశాబ్దాల క్రితం వరకు కూడా ముత్తారం చెరువు నిండ లేదని, ఇప్పుడే చెరువు నిండి మత్తడి పోస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.
