
డిసెంబర్ 27( శ్రీరామ్ చక్రి న్యూస్) భారత కమ్యూనిస్టు పార్టీ—సీపీఐ—ఆవిర్భావానికి నూరు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పలు ప్రాంతాల్లో శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు పార్టీ చరిత్ర, ప్రజా ఉద్యమాల్లో చేసిన సేవలను గుర్తు చేశారు.
కొమురవెల్లి మండలం కుడిక్యాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బాల్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం సీపీఐ శతాబ్ద కాలంగా పోరాటం చేస్తోందని అన్నారు.
సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే సీపీఐ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి పనిచేస్తుందని బాల్ మోహన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సీపీఐ శతాబ్ది వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు
