భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఒడ్డుగూడెం సమీపంలో బైక్ పై నుంచి ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

టేకులపల్లి, జనవరి 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఒడ్డుగూడెం సమీపంలో బైక్ పై నుంచి ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిదగడ్డ గ్రామానికి చెందిన గొగ్గల రాజు (29) టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన రేష్మాతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.
