రహమత్నగర్, అక్టోబర్ 16 (శ్రీరామ్ చక్రీ న్యూస్)

జూబ్లీహిల్స్ బైఎలక్షన్కు సంబంధించి బీజేపీ ఎన్నికల కార్యాచరణను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రహమత్నగర్ డివిజన్లో బూత్ కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశం జరిగింది. డివిజన్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా డివిజన్ ఇంచార్జ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మాజీ శాసనసభ్యులు కేఎస్ రత్నం, స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందెల శ్రీరాములు పాల్గొన్నారు.
వారు సమావేశంలో బూత్ స్థాయి నేతలకు ఎన్నికల ప్రణాళిక, ప్రచార కార్యక్రమాలు, నిర్వహణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
