
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా ఈ రోజు బూత్ నం. 297 పరిధిలోని కమలాపురి కాలనీ ఫేజ్ 1, తన్వీర్ హాస్పిటల్ సమీపంలోని పార్కు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కారు గుర్తుకు ఓటు వేయాలని, అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా పలువురు స్థానికులు స్పందిస్తూ,కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓటు వేసాం… ఇప్పుడు దాని ఫలితం చూశాం,”
అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు

కేసీఆర్ పాలనలో పేదల కోసం అనేక పథకాలు అమలయ్యాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు లాంటి ఉపయోగకరమైన పథకాలు అందాయి,”అని చెప్పిన వారు,ఈసారి మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేస్తాం,”అని స్పష్టంగా తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బూత్ నం. 297 ఇంచార్జ్ బోయపల్లి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
