అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుపడింది. దాని కారణంగా రద్దు చేసిన రైలును నేటికీ పునరుద్దరించలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిా ఉన్నాయి.

గుంతకల్లు(అనంతపురం): గుంతకల్ల నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ డే ప్యాసింజరు రైళ్లు పునరుద్ధరించని కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్ల కిందట గుంతకల్లు-ఎగ్మోర్ (చెన్నై), యశ్వంతపూర్-విజయవాడ (56503/04), గుంతకల్లు-గుల్బర్గా ప్యాసింజరు రైళ్లు నడిచేవి. కరోనా సీజన్ పూర్తయిన తర్వాత పలు ప్యాసింజరు, ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినా ఈ ప్యాసింజరు రైళ్లను పట్టాలెక్కించలేదు. గుంతకల్లు-తిరుపతి, గుంతకల్లు-కాచిగూడ, గుంతకల్లు-రాయచూరు ప్యాసింజర్లను మాత్రమే పునరుద్ధరించారు.
