‘నన్ను సర్పంచ్‌ను చేయండి.. ఊరిలో ఊహించని అభివృద్ధి చేస్తా. సర్కారు ఇచ్చినా, ఇవ్వకున్నా.. తన సొంత ఖర్చులతో ఊరంతటికీ ఉపకారం చేస్తా’ అని ఎన్ఆర్ఐ అయిన ఆశావహుడైన సర్పంచ్ అభ్యర్థి .

తనను గెలిపించినా, ఏకగ్రీవం చేసినా ఊరికి అన్నీ తన సొంత ఖర్చులతో సేవ చేస్తానని అదిరిపోయే హామీలతో ఓ మ్యానిఫెస్టోనే విడుదల చేశాడు. ఆ మ్యానిఫెస్టో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్ఆర్ఐ రావెళ్ల కృష్ణారావు స్వగ్రామం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురం. ఆ పంచాయతీ పరిధిలో 1,900 జనాభా, 1,500 మంది ఓటర్లు ఉన్నారు.
