దిత్వా తుఫాన్ వార్తలతో జిల్లాలో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు.

దిత్వా తుఫాన్ వార్తలతో జిల్లాలో అన్నదాతలు టెన్షన్ పడుతున్నారు. ధాన్యం నిల్వలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడు తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాతో పోల్చుకుంటే ఉత్తర కోస్తాకు ప్రభావం చూపదని చెబుతున్నా.. గత అనుభవాల దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వాతావరణం మారింది. ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేశాయి. ఈ నేపథ్యంలో రైతులు కూలీల కొరతను అధిగమించి ధాన్యం నిల్వలను కల్లాలకు తరలించే పనిలో పడ్డారు. మరికొంతమంది పంట పొలాల్లోనే వరి పనాలను కుప్పలుగా వేస్తున్నారు
