హైదరాబాద్ : దుబ్బాకలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు అమ్మే ఓ మహిళను మోసం చేశారు. అప్రమత్తమైన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక మార్కెట్లో ఓ మహిళ కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తోంది. అయితే శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహిళ వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. ఇక రూ. 200 నోట్లు నాలుగు చొప్పున ఆమెకు చెల్లించారు. ఆ తర్వాత ఆమె సరుకులు కొనేందుకు అక్కడే ఉన్న ఓ హోల్‌సేల్ షాపుకు వెళ్లింది. సరుకులు కొన్న తర్వాత పైసలు ఇవ్వగా.. రూ. 200 నోట్లు నకిలీవని తేలింది. నాలుగింటిలో మూడు నోట్లు సేమ్ సీరియల్ నంబర్‌ను కలిగి ఉన్నాయని హోల్ సేల్ షాపు యజమాని మహిళకు చెప్పాడు.
