ఇళ్లు కూలిపోవడం, పట్టణాలు జలమయమవడం, కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

కొలంబో: దిత్వా తుఫాన్ శ్రీలంకను కుదిపేస్తున్నది. ఇళ్లు కూలిపోవడం, పట్టణాలు జలమయమవడం, కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 334 మంది మరణించగా, 370 మంది ఆచూకీ గల్లంతయింది.
