సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తుంగతుర్తి, డిసెంబర్ 16 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆస్పత్రి ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో అప్పటి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడి రూ.45 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి మంజూరు చేయించి శంకుస్థాపన చేయించారని తెలిపారు.
