మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తిరుపతి : మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్నస్వామివారిని 82,022 మంది భక్తులు దర్శించుకోగా 20,230 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి బుధవారం శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు
