బీజాపూర్ జిల్లాలో భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు. మావోయిస్టు కేడర్ ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేష

బీజాపూర్: చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం గన్‌ఫైట్ జరిగింది. భద్రతా దళాలకు చెందిన జాయింట్ టీమ్ .. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్నది. మావోయిస్టు కేడర్ ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటి వరకు ఇద్దరు నక్సల్స్ మృతదేహాలను సేకరించినట్లు ఓ అదికారి చెప్పారు. ఆయుధాలను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
