గత కొన్ని సంవత్సరాల నుంచి తమ గ్రామస్తులకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో చిన్నమాసాన్ పల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైందని.. ఈ విషయం పలుమార్లు అధికారులకు సూచించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయపోల్, డిసెంబర్ 30 : రాయపోల్ మండల పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లి గ్రామ సర్పంచ్ రేకుల నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మిషన్ భగీరథ ఏఈ అభినయ్తో కలిసి చిన్నమాసాన్ పల్లి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను గల్లి గల్లీలో తిరిగి సమస్యను వివరించి అధికారులకు చెమటలు పుట్టించారు.
