సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన ముఠాను ఖమ్మంజిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 18మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు

ఖమ్మంజిల్లా పెనుబల్లి పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. గత నెల 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
