నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ గంజాయి ముఠా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
