హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి
అయితే అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్కలేనంతా డబ్బు బయటపడుతుంది. ఆస్తులు కూడా భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల నగదు పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. భారీగా బంగారం కూడా పట్టుబడింది. ఈ బంగారం విలువను కూడా అధికారులు లెక్కిస్తున్నారు.

