డోనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ ప్లేన్‌ను మళ్లీ వెనక్కి తీసుకువచ్చారు. దావోస్‌లో జరుగుతున్న మీటింగ్‌కు ఆయన మరో విమానంలో వెళ్లనున్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణించే విమానం వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరిగి వచ్చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్‌కు ఆయన వెళ్లేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానంలో బయలుదేరారు. అయితే టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల తర్వాత ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ విమానంలో స్వల్ప స్థాయి ఎలక్ట్రిక్ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
