
చౌహన్ గెలుపుతో చాకలి దాని గుట్ట తండా కు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చాకలి దాని గుట్ట తండా సర్పంచ్ గా 318 ఓట్ల మెజారిటీతో గబ్రు చౌహాన్ గెలుపొందారు.
శుక్రవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి,మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాకలిగాని గుట్ట తండా సర్పంచ్ గా గబ్రు చౌహాన్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. నూతన సర్పంచ్ మంచి వ్యక్తి కావడం వల్ల తండా అభివృద్ధికి తాను కూడా నిధులు కేటాయిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసి రామ్ నాయక్,కిషన్ నాయక్,రూప్ సింగ్,చందర్, లింబ్య,ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, వార్డు సభ్యులు శ్రీను నాయక్,నాగేష్ నాయక్,పి.శంకర్ నాయక్,శ్రీను నాయక్,శాంతి శ్రీను నాయక్,తదితరులు పాల్గొన్నారు.
