
డిసెంబర్ 17 (శ్రీరామ్ చక్రి న్యూస్) రోజు మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ దాసరి నారాయణ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ హరి హర క్షేత్రపాలకుడు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మీర్పేట్ మున్సిపల్ బీజేపీ SC మోర్చా ఉపాధ్యక్షుడు మల్లికార్జున గురు స్వామి ఆధ్వర్యంలో, గురు స్వాములు అనిల్ యాదవ్, రమేష్, వడ్ల రాజు స్వామి సమక్షంలో నిర్వహించబడింది.
ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న వారిలో మీర్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతి చారి గారు, మీర్పేట్ కార్పొరేషన్ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి గారు ప్రముఖులు.
అలాగే మాదిరి రమేష్ (జిల్లా కౌన్సిల్ సభ్యులు), కోడూరు సోమేశ్వర్, గాజుల మధు, చిల్లంపల్లి రాజశేఖర్, కే. శ్యామ్ సుందర్, ఆవుల సత్తయ్య, గోపీనాథ్, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొని “స్వామియే శరణం అయ్యప్ప శరణం” నామస్మరణతో పరిసరాలను మారు మోగించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
