ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. ఆ యుద్ధాన్ని ఆపడం వల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్ని మాట్లాడారు

న్యూయార్క్: ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. ఆ యుద్ధాన్ని ఆపడం వల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్ని మాట్లాడారు. ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం పలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇండోపాక్ వార్ ఆపడం వల్ల సుమారు కోటి మంది ప్రాణాలను రక్షించారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను మెచ్చుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
