యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఫైనలియర్ యూజీ, పీజీ విద్యార్థుల కోసం ఈనెల 30, 31 తేదీలలో రెండురోజుల పాటు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.

ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో కే12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, హైదరాబాద్లోని ఆర్కిడ్స్ఇంటర్నేషనల్ స్కూల్ కోసం పేరెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికలు, అనుదీప్ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ ఐటీఎస్ సంస్థల్లో వివిధ ఐటీ, నాన్-ఐటీ ఉద్యోగాల కోసం శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి అదే రోజుల్లో నమోదు ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు.
