అల్మాస్గూడ చౌరస్తాలో ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు బడంగ్పేట్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు శశివర్ధన్ రెడ్డి మరియు మున్సిపల్ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా అల్మాస్గూడ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడినవి. మోదీ గారి ఆయురారోగ్యాల కోసం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అంతకుముందు పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ:
మన దేశానికి సేవ చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని వేడుకలు జరపడం గర్వంగా ఉంది. నరేంద్ర మోడీ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం,” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శక్తికేంద్ర ఇంచార్జ్ శివారెడ్డి, బూత్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, విష్ణు, కన్నయ్య, నరసింహారెడ్డి, చిరంజీవి, అవినాష్ ,తదితర బీజేపీ నాయకులు, కాలనీవాసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



