శ్రీశైలం అవేర్ హాస్పిటల్ నుండి తిమ్మాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్డుకు సి.ఆర్.ఐ.ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం….హర్షం వ్యక్తం చేసిన శ్రీరాములు అందెల*
మహేశ్వరం నియోజకవర్గం శ్రీశైలం హైవే అవేర్ హాస్పిటల్ నుండి తిమ్మాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్ కొరకు కేంద్ర ప్రభుత్వం సి.ఆర్.ఐ.ఎఫ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఈ మేరకు ప్రకటించింది. ఈ సందర్భంగా *రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు, హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాములు , మాట్లాడుతూ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన *కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి* గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు వెంటనే స్పందించి సంబంధిత కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లి డబుల్ లైన్ రోడ్డు నిర్మించాలని కోరగా గడ్కారీ సానుకూలంగా స్పందించి అవేర్ హాస్పిటల్ నుండి లేమూరు మీదుగా తిమ్మాపూర్ వరకు 14 కిలోమీటర్లకు గాను 38 కోట్లు నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కారీ గారికి, గంగాపురం కిషన్ రెడ్డి కి మరియు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తరఫున శ్రీరాములు కృతజ్ఞతలు తెలిపారు.


