
మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ SBI బ్యాంక్ పక్కన, ప్రతి నెల రెండవ శనివారం మరియు మూడో శనివారం రోజున, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమాన్ని BRS సీనియర్ నాయకులు దండు మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి భక్తుడు, దండు మహేందర్ మాట్లాడుతూ…
ప్రతి రెండవ శనివారం మరియు నాల్గవ శనివారం, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. భగవంతుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సకల అష్టైశ్వర్యాలతో జీవించగలరు.”
మహేందర్ అన్నదాన నిర్వహణ ద్వారా వచ్చే సానుకూల ప్రభావాన్ని ఇలా వివరించారు:”ఒకరికి అన్నం పెట్టడం లోపలున్న ఆనందం, మరే ఎలాంటి ఆనందంతో పోల్చలేం. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి సరిపడినంత ఆహారాన్ని పంచి, ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని పొందాలి.”ప్రతీ నెల రెండవ, మూడో శనివారం , ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది.స్థానికులు, విద్యార్థులు, కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని,.అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, సమాజంలో ఆనందం, ఆరోగ్యం, సకల అష్టైశ్వర్యాలు పొందగలరని మహేందర్ మహేందర్ మీడియా ముఖంగా తెలిపారు
