వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు.

తాగునీటి వసతిని మాత్రం మరిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కోడెల, ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భీమేశ్వర ఆలయానికి చేరుకుంటున్న చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. కేవలం రద్దీగా సమయాల్లో మాత్రమే తాగునీటిని అందిస్తుండగా, మిగతా రోజుల్లో పట్టించుకోకపోవడంతో గోసపడుతున్నారు.
