అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికలపై చేసే డ్యాన్స్ మూమెంట్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ట్రంప్ వేసే స్టెప్పులను చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు..

ట్రంప్ వేసే స్టెప్పులను చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు.. కానీ ట్రంప్ చేసే ఆ డ్యాన్స్ ఒక్కరికీ మాత్రం అస్సలు నచ్చదంట. ఆమె ఎవరో కాదు ట్రంప్ సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా. అవును.. ఇది నిజం. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌నే స్వయంగా బయటపెట్టారు. వాషింగ్టన్‌లోని కెన్నెడీ సెంటర్లో రిపబ్లికన్ చట్టసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
