హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

రంగారెడ్డి : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్మాస్గూడ ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ (70) అనే వృద్ధురాలి కాలికి చైనా మాంజా కాలికి చుట్టుకుంది. ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
