మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు మొదట ప్రాధాన్యత ఉంటుందని, ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పోటీకి అవకాశం రానివారు నిరుత్సాహ పడవద్దని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు.
