ఐక్యరాజ్యసమితి లో పాకిస్థాన్ వైఖరిని భారత్ మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ వైఖరిని భారత్మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని మండిపడింది.

సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్, జమ్ముకశ్మీర్, సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని శిక్షిస్తూ సరికొత్త సాధారణ స్థితి నెలకొల్పినట్లు భారత్ చెబుతున్న పరిస్థితి ఏమీ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తమ ప్రతిస్పందనతోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు.
