తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న మేడారం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్శనకు సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం మహాజాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన, గద్దెల మార్పుపై ఫైనల్ డిజైన్ విడుదల వంటి కీలక కార్యక్రమాలు ఈ సందర్శనలో భాగంగా ఉన్నాయి.
మంత్రి సీతక్క ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సజావుగా సాగేలా భద్రత, రవాణా, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
