బాల్కొండ, అక్టోబర్ 15 (శ్రీరామ్ చక్రీ న్యూస్):

ఏఐసీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జిల్లావారీగా అధ్యక్షుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఎ మరియు బి బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు పార్టీ పటిష్ఠత, విస్తరణపై నాయకులతో సమాలోచనలు జరిపారు. పార్టీకి అత్యవసరంగా బలమైన నాయకత్వం అవసరమని, అందుకు ప్రతి కార్యకర్త తన వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్, పిసిసి ఆర్గనైజర్లు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డా. రవి బాబు, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, ఎ & బి బ్లాక్‌కి చెందిన ముఖ్య నాయకులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

