ఎదిగిన బిడ్డ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కష్టపడి చదించిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని ఒక్కసారి ఇంట్లో కుప్పకూలి అపస్మారకస్థితిలోకి వెళ్లగా ..చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిం

కళాశాలలో యాజమాన్యం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వైష్టవి కొంత ఆలస్యంగా చేరుకోవడంతో కళాశాలకు చెందిన ఇంగ్లీష్, ఫిజిక్స్ లెక్చరర్స్ అయిన మధుర, శ్రీలక్ష్మిలు ఆ అమ్మాయిని అందరి ముందు అసభ్యకర పదజాలంతో మందలించారు. పరీక్ష రాసిన వర్షిణి అనంతరం ఇంటికి వెళ్లింది. మానసింగా కుంగిపోయి కళాశాలలో జరిగిన విషయాన్ని తల్లి మాలతికి చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదామని కుమార్తెను తల్లి సముదాచించింది. ఇంతలోనే వర్షిణి తలనొప్పిగా ఉందని సృహ తప్పి పడిపోయింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు స్కానింగ్ చేసి అమ్మాయికి తీవ్ర మనస్థాపంలో బ్రెయిన్లో బ్లడ్ స్కాట్ అయిందని చెప్పారు. కాగా చికిత్స పోందుతూ.. గురువారం రాత్రి మృతి చెందింది.
