
ఎల్బీనగర్, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఆర్కేపురం డివిజన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి గారు ఎల్బీనగర్ డీసీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గౌరవ డా. బీ. అనురాధ (IPS) మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.

పోలీసు విభాగంలో ఆమె సేవలు అభినందనీయమని ప్రశంసించిన మధుర ఉపేందర్ రెడ్డి, మహిళల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో డీసీపీగా అనురాధ IPS గారి నాయకత్వం మరింత బలాన్ని ఇస్తుందన్నారు.
ఈ సందర్భంగా మహిళా భద్రత, శాంతిభద్రతల అంశాలపై క్లుప్తంగా చర్చించారని సమాచారం.
