మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గడువులోపు పనులు పూర్తి చేస్తే చాలు.. అవి భక్తులకు ఉపయోగపడినా లేకున్నా మాకేంటి అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.

మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గడువులోపు పనులు పూర్తి చేస్తే చాలు.. అవి భక్తులకు ఉపయోగపడినా లేకున్నా మాకేంటి అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. జాతర పరిసరాల్లో రేకులతో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ శాఖ చేపట్టింది. సెప్టిక్ ట్యాంకుల కోసం గుంతలు తవ్వించి దానిపై రక్షణగా తడకలు ఏర్పాటు చేయాలి.
