యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నూ భూముల కోసం విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులు సమావేశమయ్యారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలను విద్యార్థులు వివరించారని తెలిపారు.
