
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారు భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి , తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

రోడ్‌షోకు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు విపరీతంగా హాజరై ఉత్సాహంగా స్వాగతం పలికారు. ప్రజలతో మాట్లాడుతూ కేటీఆర్ గారు, జూబ్లీహిల్స్ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
