ఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 650 మంది విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి హరీశ్‌రావు బ్లాంకెట్లను పంపిణీ చేశారు.

మొదటిసారి 2004లో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయించానని గుర్తుచేశారు. ఈ పాఠశాల అంటే తనకు ఎంతో ఇష్టమని, 22 ఏండ్ల అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్ చార్జీలను ఆర్థిక మంత్రితో మాట్లాడి విడుదలయ్యేలా చూస్తానన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.14.50 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించామని హరీశ్‌రావు తెలిపారు
