బిజెపి నేత శ్రీరాములు అందెల ధాటిగా ప్రభుత్వంపై ఫైరింగ్!ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం

బిజెపి నేత శ్రీరాములు అందెల ధాటిగా ప్రభుత్వంపై ఫైరింగ్!ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ కొత్త జోనల్ కేటాయింపుల్లో భాగంగా బడంగ్ పేట్, ఆదిభట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను చార్మినార్ జోన్ కు జత చేయడంపై బిజెపి నాయకుడు అందెల శ్రీరాములు తీవ్రంగా స్పందించారు.
మహేశ్వరం బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన శ్రీరాములు—
“అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో విలీనం చేయడాన్ని బిజెపి మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తోంది. మన ప్రాంతాలను చార్మినార్ జోన్లోకి తీసుకెళ్లడం పూర్తిగా అర్థరహిత నిర్ణయం,” అని తీవ్ర విమర్శలు చేశారు.అయన ఆరోపణలు చేస్తూ—
“ఈ నిర్ణయం ప్రజల ప్రయోజనాల కోసం కాదు… ఏదో రాజకీయ లెక్కల కోసం తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనితో మన ప్రాంత ప్రజలకు సమస్యలు మాత్రమే పెరుగుతాయి” అని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై కూడా శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సబితా ఇంద్రారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వెంటనే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
“ప్రజల ప్రాంతాన్ని ఎలా మార్చినా, ఎలా జతచేసినా వాళ్లు మౌనంగా ఉండడం సరికాదు” అని అన్నారు.
అంతటితో ఆగని శ్రీరాములు—
“ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. అవసరమైతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద మాస్ మూమెంట్ కూడా చేపడతాం” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విలీనం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు.
