అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ పిలుపునిచ్చారు.

యైటింక్లయిన్ కాలనీ, జనవరి 2 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ పిలుపునిచ్చారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో కార్యకర్తలతో శుక్రవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
