ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త తలనొప్పిగా మారనున్నది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త తలనొప్పిగా మారనున్నది. మంచిర్యాల జిల్లాలో 29 మంది, నిర్మల్ జిల్లాలో 17 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 32 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 12మంది డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీలో డీసీసీ పదవికి గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ పెరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు
