సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో అగ్ని ప్రమాదం సంభవించి 54మంది కార్మికులు, సిబ్బంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం.

పలువురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతిచెందారు. కాగా, బాధితులకు పరిహారం అందించడం, సాయం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారులపై హైకోర్టు జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు పోలీసుల్లో కదలికి వచ్చింది. శనివారం రాత్రి కేసు విచారణ అధికారి, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో బీడీఎల్ భానూర్ పోలీసులు సిగాచి ఇండస్ట్రీస్ సీఈవో అమిత్రాజ్ సిన్హాను అరెస్టు చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అమిత్రాజ్ సిన్హాను కోర్టు అదేశాల మేరకు కంది జైలుకు
