సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు.

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 చిన్నారులు ఉన్నారు. కాగా, మరణించిన వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు. మల్లేపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది మృతిచెందారు.
