సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు (ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
