ఉత్తమ్‌కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్నారు.

డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా.. మౌనం ఎందుకు..? మా హయాంలో ఏడు అనుమతులు తెచ్చాం.. రెండేళ్లలో ఒక్క అనుమతి అయినా తెచ్చారా..? అని హరీష్ రావు హరీష్ రావు ప్రశ్నించారు. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మండిపడ్డారు. రెండు టన్నెల్స్ బీఆర్ఎస్ హాయాంలోనే పూర్తి అయ్యాయన్నారు,మిస్టర్ ఉత్తమ్ మీ చేతకాని తనాన్ని మాపై రుద్దుతున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు రెండేళ్ళ క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్‌కు ఇంకా పట్టు రానట్టుంది. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటాడోనన్నారు.
