.ఆదివారం కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలోని కరీంనగర్-జగిత్యాల ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు అక్కడే బైఠాయించారు.

కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కొడిమ్యాల మండల రైతులు ఆగ్రహించారు. 40కిలోల సంచికి మూడు కిలోల చెప్పున కటింగ్ చేస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో భగ్గుమన్నారు. ఆదివారం కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలోని కరీంనగర్-జగిత్యాల ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, తాలు పేరిట గతంలో 40కిలోల సంచికి 2కిలోలు కటింగ్ చేసి వెంటనే ధ్యానం తూకం వేసేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం 40కిలోల బస్తాకు మూడు కిలోలు కటింగ్ చేస్తేనే కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు చెప్పడం ఏ మాత్రం సరికాదన్నారు.
